Sunday, April 28, 2024

రూ.20 లక్షల కోట్ల కంపెనీ రిలయన్స్

- Advertisement -
- Advertisement -

దేశంలో ఈ మైలురాయిని సాధించిన తొలి కంపెనీ ఇదే
షేరు విలువ పెరగడంతో మార్కెట్ క్యాప్ జంప్

ముంబై : దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ మరో ఘనతను సొంతం చేసుకుంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది. భారత్‌లో ఈ మైలురాయిని సాధించిన తొలి కంపెనీ ఇదే. మంగళవారం కంపెనీ షేర్లు జీవితకాల గరిష్ఠం రూ.2,958కి చేరాయి, దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. గత రెండు వారాల్లో ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు పెరగడం గమనార్హం. జనవరి 29 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముందు కంపెనీ సెప్టెంబర్ 2021లో రూ.15 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. 2019లో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లు దాటింది.

దేశంలోనే అతిపెద్ద కంపెనీ..
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. ముంబైకి చెందిన రిలయన్స్ గ్రూప్ చమురు నుండి టెలికాం, రిటైల్ వంటి రంగాలలో సేవలందిస్తోంది. రిలయన్స్ తర్వాత టాటా గ్రూప్‌కు చెందిన ఐటి దిగ్గజం టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) అత్యంత విలువైన కంపెనీగా ఉంది. టిసిఎస్ మార్కెట్ క్యాప్ రూ.15.07 లక్షల కోట్లుగా ఉంది.

దేశంలోనే అత్యంత ధనవంతుడు..
ఫోర్బ్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడుగా ఉన్నారు. ఆయన మొత్తం నికర విలువ రూ.9.38 లక్షల కోట్లుగా ఉంది. కాగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.6.64 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News