Wednesday, May 1, 2024

22వ రోజు డీమ్డ్ అప్రూవల్ వస్తుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

22nd day deemed approval in Telangana

హైదరాబాద్: టిఎస్ బిపాస్‌తో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. టిఎస్ బిపాస్ పై శాసన సభలో చర్చ జరిగినప్పుడు కెటిఆర్ మీడియాతో తెలిపారు. టిఎస్ బిపాస్ అమలు పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. టిఎస్ బిపాస్ కోసం లోతుగా అధ్యయనం చేశామన్నారు. సంస్కరణల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. 21 రోజుల్లో పర్మిషన్ రాకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ వస్తుందని, చట్టం పట్ల ప్రజలకు భయం, గౌరవం ఉండాలన్నారు. తప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తామని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News