Friday, May 3, 2024

దేశవ్యాప్తంగా 24 ఫేక్ యూనివర్సిటీలు

- Advertisement -
- Advertisement -

24 fake Universities across the India

 

జాబితా ప్రకటించిన యుజిసి

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ యూనివర్సిటీల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) బయటపెట్టింది. దేశంలో గుర్తింపు లేకుండా చెలామణీ అవుతున్న ఫేక్ యూనివర్సిటీలు 24 వరకు ఉన్నాయని యుజిసి పేర్కొంది. ఇందులో అత్యధిక ఫేక్ యూనివర్సిటీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా, తర్వాతి స్థానంలో ఢిల్లీలో ఉన్నట్లు తేల్చారు. యుజిసి చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న స్వయం ప్రకటిత, గుర్తింపులేని యూనివర్సిటీలు 24 వరకు ఉన్నాయని యుజిసి తెలిపింది. వీటికి ఎలాంటి డిగ్రీలూ ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇందులో ఎనిమిది ఉత్తర ప్రదేశ్ నుంచి ఉండగా.. ఢిల్లీ నుంచి ఏడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి రెండేసి చొప్పున ఉన్నాయి. కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్టు యుజిసి వెల్లడించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా నకిలీ యూనివర్సిటీల జాబితాను ప్రకటిస్తున్నామని వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News