Monday, May 13, 2024

డిఆర్‌ఐ దాడుల్లో 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై డిఆర్‌ఐ అధికారుల బృందం శనివారం దాడులు నిర్వహించిన 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాపై కీలక సమాచారం అందడంతో హైదరాబాద్ నగరంలో మరో4 చోట్ల డీఆర్‌ఐ అధికారులు సోదాలు చేపట్టారు. డిఆర్‌ఐ సోదాల్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రగ్స్ తయారీలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు డిఆర్‌ఐ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో రా మెటిరీయల్స్‌ను తయారు చేస్తున్న ఈ ముఠా హైదరాబాద్ నుంచి ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మెపిడ్రిన్‌తో ఎండిఎంఎ, కొకైన్, అంపెటమిన్ అనే వివిధ రకాల డ్రగ్స్ ను తయారీ చేస్తోన్న ముఠా గురించిన పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. డ్రగ్స్ ముఠా మియావ్ మియావ్ డ్రోన్ పేర్లతో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారని, సిటీలోని కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఈ ముఠా విచ్చల విడిగా డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈక్రమంలో నూతన సంవత్సర వేడుకలలో డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు కొన్ని ముఠాలు యత్నిస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ముఠాల కదలికలపై నిఘా సారిస్తున్న క్రమంలో తాజాగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

250 kg Ephedrine seized by DRI in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News