- Advertisement -
ఉత్తరాఖండ్ మెరుపు వరదల సమయంలోనే 28 మంది పర్యాటకులు జాడ తెలియకుండా పోవడం కలవరపెడుతోంది. వీరంతా కేరళ వాసులే. అయితే వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడ్డారు. మరో 8 మంది కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. వరదలు ముంచెత్తి సమయంలో వారంతా గంగోత్రికి వెళ్తున్నట్లు సమాచార ఉందని, అయితే ప్రస్తుతం ఎవరూ కాంటాక్ట్‌లో లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. వారు వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడడంతో క్షేమ సమాచారంపై గందరగోళం ఏర్పడింది. అందరూ ఎక్కడైన చిక్కుబడిపోయారా? ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయ్యాయా? అనేది అయోమయంగా ఉంది. వీరంతా ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అక్కడికి వెళ్లారు.
- Advertisement -