Monday, May 20, 2024

2డీజీ సాచెట్ ధ‌ర ఖరారు

- Advertisement -
- Advertisement -

2DG sachet price finalized

 

న్యూఢిల్లీ: డిఆర్‌డివో రూపొందించిన 2-డిజి సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఒక్కో 2డిజి సాచెట్ ధర రూ.990గా నిర్ధారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వం ఆస్పత్రులకు డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్టు శుక్రవారంనాడు వెల్లడించింది. అయితే డిస్కౌంట్‌పై రెడ్డీస్ స్పష్టతనివ్వలేదు. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్‌లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ అందించాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2-డిజి (2 డిఆక్సి-డి గ్లూకోజ్)’ ఔషధాన్నిడాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విదితమే. ముందుగా 10వేల సాచెట్‌లను, మే 27న మరో 10వేల సాచెట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డిజి ఔషధాన్ని డిఆర్‌డిఓ, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేశాయి. 2-డిజి పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని,ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2-డిజి ప్రత్యేకత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News