Tuesday, April 30, 2024

పోఖ్రాన్‌లో యాంటీ ట్యాంక్ మిసైల్ ట్రయల్ విజయవంతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవొ) దేశీయంగా రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపిఎటిజిఎం) ఆయుధ వ్యవస్థ యొక్క అభివృద్ధికి చెందిన క్షేత్రస్థాయి పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజిలో ఈ నెల 13న డిఆర్‌డివో తోపాటు సైన్యం సంయుక్తంగా ఈ పరీక్షలు చేశారు. ఈ వ్యవస్థలో క్షిపణి, లాంచర్, టార్గెటింగ్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి. వివిధ పరిస్థితుల్లో దీని ప్రభావాన్ని నిరూపించడానికి అనేక పరీక్షలు చేశారు.

భారత సైన్యం నిర్దేశించిన లక్షాలను, అవసరాలను ఇవి నెరవేర్చగలిగాయి. క్షిపణికి చెందిన వార్‌హెడ్ పని తీరుపై ఈ పరీక్షలు దృష్టి కేంద్రీకరించాయి. ఆధునిక ట్యాంకుల కంటే ఈ క్షిపణి అద్భుతమైన ఫలితాలను అందించింది. మ్యాన్‌పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ పగలు లేదా రాత్రి దాడులకు కూడా ఉపయోగించ బడుతుంది. అధికారికంగా ఈ మిస్సైల్‌ను మోహరింప చేయడానికి ముందు భారత సైన్యం తుది ప్రయోగానికి సిద్ధమైంది.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో బృందాన్ని, సైన్యాన్ని అభినందించారు. అత్యంత ఆధునిక సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ క్షిపణి వ్యవస్థ ఆత్మనిర్భరతకు , స్వయం సామర్థానికి ప్రతీకగా అభివర్ణించారు. అలాగే స్వయం సామర్థంలో ముందడుగుగా పేర్కొన్నారు. డీఆర్‌డీవొ ఛైర్మన్ సమీర్ వి కామత్ ఈ ట్రయల్‌కు సహకరించిన బృందాలను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News