Saturday, May 4, 2024

మహారాష్ట్రలో భారీ వర్షానికి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Mumbai rain

ముంబై: మహారాష్ట్రలో భారీగా కురిసిన వర్షానికి గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. జలమయ ప్రదేశాల నుంచి దాదాపు 95 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం తెలిపింది. మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో 13 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను, మూడు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్‌డిఆర్‌ఎఫ్)లను కూడా నియోగించారు. ముంబై శివారుల్లో ఇద్దరు కట్టడం కూలి చనిపోగా, గడ్‌చిరోలి జిల్లాలో ఒకరు వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. గడిచిరోలి, నందర్బార్,ముంబై శివారు ప్రాంతాల్లోని 10 గ్రామాలు వానలకు ప్రభావితం అయ్యాయి. రత్నగిరి జిల్లాలోని చిప్లన్ పట్టణానికి దగ్గరలో ఉన్న పరశురామ్ ఘాట్ ఇప్పటికీ రాకపోకలకు బంద్ అయి ఉంది. పరశురామ్ ఘాట్‌లో గత వారం కొండచరియలు విరిగిపడ్డంతో ముంబై-గోవా జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్‌ను మరల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News