Saturday, May 4, 2024

ఢిల్లీలో పొగమంచు.. ఐదు విమానాల మళ్లింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో పొగమంచు కారణంగా రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం కూడా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు ఢిల్లీకి చేరుకోవలసిన ఐదు విమానాలను జైపూర్‌కు మళ్లించినట్టు విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం ప్రయాణికులకు అందించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పొగమంచు ఆవరించడంతో విజిబిలిటీ 150 మీటర్లకు పరిమితమైందని వాతావరణ శాఖ తెలిపింది.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 500 లేదా అంతకంటే తక్కువ విజిబిలిటీ నమోదవ్వగా పాలంలో 100, సఫ్దర్‌గంజ్‌లో 200 మీటర్లు నమోదైంది. నిన్నటివరకు ఢిల్లీలో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయిన విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా లోని అనేక ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. చండీగఢ్, బీహార్, త్రిపురలో తక్కువ మోతాదులో మంచు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీలో మరో ఐదు రోజులు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News