Sunday, April 28, 2024

మళ్లీ కేసులు పెరిగినయ్

- Advertisement -
- Advertisement -
Corona

 

రాష్ట్రంలో కొత్తగా 31 మంది కరోనా బాధితులు, వీటిలో 30 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనివే
ఒకరు మృతి, 24 మంది డిశ్చార్జ్
కరోనా మహిళకు పుట్టిన చిన్నారికి నెగిటివ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1163కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 751కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 382 మంది చికిత్స పొందుతుండగా, ఈ వైరస్ దాడిలో ఇప్పటి వరకు ముప్పై మంది మరణించారని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 30 మంది ఉండగా, మరో వలస కార్మికుడికి వైరస్ సోకడం ఆందోళనకరం. శనివారం డిశ్చార్జ్ అయిన వారిలో హైదరాబాద్ నుంచి 12, సూర్యాపేట్ 2 వికారాబాద్ 1,ఆదిలాబాద్ 2,మేడ్చల్ 1,రంగారెడ్డి 1 సిరిసిల్లా 1, గద్వాల్ నుంచి ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో పాటు మరణించిన వ్యక్తి సరూర్‌నగర్ ప్రాంతానికి చెందినవాడని, ఈ వ్యక్తికి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇతనికి కిడ్ని సంబంధిత సమస్యలు ఉండటం వలనే వైరస్ దాడిలో మృతి చెందాడని అధికారులు చెబుతున్నారు.

కరోనా గర్భిణి స్త్రీకి పుట్టిన బాబుకు నెగటివ్…

రాష్ట్రంలో తొలి సారి గర్భిణి స్త్రీకి విజయవంతంగా గాంధీ వైద్యులు డెలివరీ చేసిన విషయం విధితమే. అయితే ఆ బాబుకు కరోనా టెస్టు చేయగా నెగటివ్ వచ్చిందని అధికారులు శనివారం ధృవీకరించారు. సిజేరియన్‌తో పుట్టిన ఈ బాబు 3కెజిల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. తల్లి, బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈసందర్బంగా డెలివరీ చెసిన డా మహాలక్ష్మీ హెచ్‌ఒడి, డా సంగీత, డా అనిత, డా ప్రసన్న లక్ష్మీ, డా అపూర్వ, డా మృణాళిని, డా శ్రీలక్షీ, డా అశ్విని బృందంను మంత్రి ఈటల రాజేందర్ అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News