Friday, May 3, 2024

రాష్ట్రంలో 5 వేలు యాక్టివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

346 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 వేలు మాత్రమే ఉన్నాయి. వీరిలో 2798 మంది ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతుండగా, మిగత వారు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే పేషెంట్ల సంఖ్య తగ్గిందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం 38,985 మందికి టెస్టులు చేయగా మరో 346 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 66 మంది ఉండగా,ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 9,జగిత్యాల 6, జనగాం 5, భూపాలపల్లి 3, గద్వాల 3, కామారెడ్డి 2, కరీంనగర్ 18 ,ఖమ్మం 8, ఆసిఫాబాద్ 6, మహబూబ్‌నగర్ 7,మహబూబాబాద్ 8, మంచిర్యాల 9, మెదక్ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 34, ములుగు 5, నాగర్‌కర్నూల్ 3, నల్గొండ 9, నారాయణపేట్ 1, నిర్మల్ 7, నిజామాబాద్ 8, పెద్దపల్లి 9, సిరిసిల్లా 6, రంగారెడ్డి 41, సంగారెడ్డి 10, సిద్ధిపేట్ 3, సూర్యాపేట్ 8, వికారాబాద్ 6, వనపర్తి 4, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ లో 18, యాదాద్రిలో మరో 5 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,89,135కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,82,574కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

2 లక్షల మందికి లక్షణాలు లేకుండా వైరస్ సోకింది….

రాష్ట్రంలో 2 లక్షల 2వేల 394 మందికి లక్షణాలు లేకుండానే వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అంటే వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని వైద్యశాఖ చెబుతోంది. అంతేగాక సుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే రికవరీ రేట్ కూడా భారీగా పెరిగింది. ఈక్రమంలో ప్రతి వందలో సగటున 97 మంది సులువుగా కోలుకుంటున్నారని వైద్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక డెత్ రేట్ కూడా అతి తక్కువగా రికార్డు అయింది. దేశ వ్యాప్తంగా డెత్ సగటు 1.4 శాతం తేలగా మన దగ్గర కేవలం 0.53 శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రతి రోజు 97 శాతం టెస్టులు ప్రభుత్వ కేంద్రాల్లో నిర్వహిస్తుండగా, కేవలం మూడు శాతం మాత్రమే ప్రైవేట సెక్టార్ సెంటర్లలో టెస్టులు జరుగుతున్నట్లు హెల్త్ డైరెక్టర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News