Tuesday, May 14, 2024

35 శాతం నీటి ఆదా

- Advertisement -
- Advertisement -

Paddy

 

వరి సాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులు
కిలో వరికి తెలంగాణలో 2395 లీటర్ల వినియోగం
ఎరోబిక్ వరితో 30 శాతం నీరు ఆదా.. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారం
మండలిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: వరి సాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులతో ఉమ్మడి జిల్లాల వారీగా 35 శాతం నీటిని ఆదా చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కిలో వరిసాగుకు తెలంగాణలో 5 వేల లీటర్లు వినియోగిస్తుండడం వాస్తవమా అన్న శాసనమండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి ప్రశ్నకు శాసన మండలిలో మంత్రి సమాధానమిచ్చారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ పిలిప్పీన్స్ సహకారంతో నేరుగా ఎద పెట్టే (ఏరోబిక్ వరి) మెట్ట వరి సాగుకు అనుకూలమైన రకాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. దీని మూలంగా 30 శాతం నీరు ఆదా అవుతుంది – లోతట్టు వరి సాగుకన్నా సూక్ష్మ నీటి వరిసాగు ద్వారా 50 శాతం నీటిని ఆదా చేయవచ్చున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వరి సాగులో నీటి వినియోగం తగ్గించేందుకు నూతన శాస్త్రీయ నీటి పద్దతులను ఆవిష్కరించినట్లు తెలిపారు.

రైతుల పొలాలలో ప్రదర్శనలు, లోతట్టు నీటి నిల్వ (లో ల్యాండ్ ఫీల్ ) పద్దతిలో బావులు, కాలువల కింద ఆరుతడి వరిసాగును పూర్వపు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టి 35 శాతం నీటిని ఆదా చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో తక్కువ కాలపరిమితిలో అధిక దిగుబడిని ఇచ్చే తెలంగాణ సోన, బతుకమ్మ, కూనారం సన్నాలను జయశంకర్ వర్సిటీ అభివృద్ది చేసి విడుదల చేసింది. ఇతర రకాలతో పోల్చితే ఈ రకం సాగులో దాదాపు నెల రోజుల నీటిని ఆదా చేశారు. -సిఎం దూరదృష్టితో వ్యవసాయం రంగంలో అనేక పథకాలతో పాటు పరిశోధనలకు, పంట మార్పిడికి, పంటకాలనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. – రాష్ట్ర పరిస్థితులకు అనుకూలమైన నూతన వంగడాలను తీసుకొచ్చే పరిశోధనలు సాగుతున్నాయని వివరించారు.

 

35% water saving in paddy cultivation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News