Sunday, May 5, 2024

36 శాతం రాజ్యసభ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజ్యసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులలో 36 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని, అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ. 121.81 కోట్లు అని ఎన్నికల హక్కుల సంస్థ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) తెలియజేసింది. 15 రాష్ట్రాలలో 56 రాజ్యసభ సీట్లకు బరిలో నిలచిన 59 మంది అభ్యర్థులలో 58 మంది స్వీయ ప్రకటిత అఫిడవిట్లను ఎడిఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఇడబ్లు) విశ్లేషించాయి. రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. కర్నాటకకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జిసి చంద్రశేఖర్‌ను విశ్లేషణ నుంచి మినహాయించారు. ఆయన పత్రాల స్కానింగ్ సరిగ్గా లే వు.

రెండు సంస్థలు పరిశీలించిన అభ్యర్థులలో 36 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని విశ్లేషణలో తేలింది. అదనంగా వారిలో 17 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక అభ్యర్థిపై హత్యా యత్నానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆ విశ్లేషణ ప్రకారం, 30 మంది బిజెపి అభ్యర్థులలో ఎనిమిది (27 శాతం) మంది, తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థులలో ఆరుగురు (67 శాతం), నలుగురు టిఎంసి అభ్యర్థులలో ఒకరు (25 శాతం), ముగ్గురు ఎస్‌పి అభ్యర్థులలో ఇద్దరు (67 శాతం), ముగ్గురు వైసిపి అభ్యర్థులలో ఒకరు (33 శాతం), ఇద్దరు ఆర్‌జెడి అభ్యర్థులలో ఒకరు (50 శాతం), ఇద్దరు బిజెడి అభ్యర్థులలో ఒకరు (50 శాతం), ఒక బిఆర్‌ఎస్ అభ్యర్థి (100శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తమ అఫిడవిట్లలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News