Tuesday, April 30, 2024

ముస్లిం వివాహ చట్టం రద్దు అస్సాం క్యాబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

గువాహటి: బాల్య వివాహాలను అంతం చేసే ప్రయత్నంలో భాగంగా అస్సాం ముస్లిం వివాహాల, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం, 1935ని రద్దు చేయడానికి అస్సాం క్యాబినెట్ తన ఆమోదం తెలిపింది. ప్రస్తుత చట్టం ప్రకారం వధూవరులు చట్ట ప్రకారం 18, 21 ఏళ్లు దాటనప్పటికీ వారు వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి లభిస్తోంది. ఈ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా అస్సాంలో బాల్య వివాహాలను నిషేధించేందుకు అడుగు ముందుకుపడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు. కాగా&ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ముస్లింల పట్ల వివక్షను చూపడమేనని కాంగ్రెస్ శాసనసభ్యుడు అబ్దుల్ రషీద్ మండల్ అన్నారు. ఎన్నికల ఏడాదిలో ఓటర్ల పునరేకీకరణ కోసం బిజెపి ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News