Saturday, April 27, 2024

సిఎం కెసిఆర్ స్ఫూర్తితో ‘ఛలో మైదాన్’ చేపడదాం

- Advertisement -
- Advertisement -

క్రీడలతో ఆరోగ్యమే కాదు, అద్భుతమైన ఉపాధి అవకాశాలు
బడి బాటలాగే స్వచ్ఛందంగా చలో మైదాన్‌లో అందరూ భాగమవుదాం
శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఛలో మైదాన్ చేపడదామని తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. అందమైన, అద్భుతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం మైదానం ద్వారానే సాధ్యమవుతుందని క్రీడల్లో రాణించిన సమాజం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 37వ ఎడిషన్ ఒలంపిక్ డే రన్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా ఒలంపిక్ డే రన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ.. జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా మలిచేవి క్రీడలేనన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం కేవలం మైదానం ద్వారానే సాధ్యమవుతుందని, మానవ జన్మను సార్ధకం చేసుకోవాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందుకు క్రీడలు ముఖ్యమైన సాధనమని అన్నారు. ఆసుపత్రి గడప తొక్కవద్దు అంటే ప్రతి నిత్యం మైదానంలో అడుగు పెట్టాలని, ఆటల ద్వారా అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చని క్రీడా మైదానానికి బ్రహ్మాండమైన శక్తి ఉందని ఆయన అన్నారు. పంటలు పండించి పది మందికి అన్నం పెట్టే రైతు ఒకరైతే.. పతకాల పంట పండించి దేశానికి పేరుతెచ్చే క్రీడాకారుడు మరోకరని, ఇద్దరికీ సమాజంలో సమన్నత గౌరవం ఉంటుందని వారి పట్ల సమాజమంతా ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.

క్రీడాకారులకు ప్రపంచంలో అత్యున్నత గౌరవం లభిస్తుందని, ఆ దిశగా భావి క్రీడాకారులుగా తమరిని తాము మలుచుకునే విధంగా కృషి చేయాలని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు. ఒలంపిక్ స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రతి సంవత్సరం వివిధ క్రీడా సంఘాలు ఒలంపిక్ అసోసియేషన్లు విశ్వవ్యాప్తంగా చేసే ఒక మహా యజ్ఞం ‘ఒలంపిక్ డే రన్’ అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, డబుల్ ఒలంపియన్ (హాకీ) ఎడ్వరడ్స్ రంగారెడ్డి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మల్లారెడ్డి, మనోహర్ జిల్లా క్రీడా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు, నారాయణరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News