Thursday, May 2, 2024

2021లో నాలుగు గ్రహణాలు… రెండు మాత్రమే చూడగలం

- Advertisement -
- Advertisement -

4 eclipses in 2021 but only 2 can be visible in India

ఇండోర్: వచ్చే సంవత్సరం (2021) నాలుగు గ్రహణాలు సంభిస్తాయని, వీటిలో ఒకటి సంపూర్ణ సూర్యగ్రహణం కాగా, మరొకటి సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉజ్జయిన్ కేంద్ర జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గుప్త ఆదివారం వెల్లడించారు. అయితే ఈ నాలుగుగ్రహణాల్లో రెండు మాత్రమే మన దేశం నుంచి కనిపిస్తాయని ఆయన వివరించారు. మే 26న చంద్ర గ్రహణం సిక్కిం తప్ప పశ్చిమబెంగాల్, కోసా ఒడిశా, ఈశాన్య రాష్ట్రా ల్లో కనిపిస్తుందని చెప్పారు. చంద్రుడ్ని భూమి 101.6 శాతం ఆక్రమిస్తుందని తెలిపారు. జూన్ 10న సూర్యగ్రహణం సంభవిస్తుందని, దేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. ఈ సంఘటనలో సూర్యుడు, భూమికి మధ్యగా చంద్రుడు రావడంతో సూర్యుడు 94.3 శాతం గ్రహణానికి గురవుతాడని, ఒక అగ్నివలంయంగా సూర్యుడు కనిపిస్తాడని వివరించారు. నవంబర్ 19న పాక్షిక చంద్రగ్రహణం అరుణాచల్ ప్రదేశ్, అసోం కొన్ని ప్రాంతాలకు మాత్రమే కొద్దిసేపు కనిపిస్తుందని చెప్పారు. ఈ గ్రహణంలో చంద్రుడు 97.9 శాతం భూ గ్రహణానికి గురవుతాడని తెలిపారు. డిసెంబర్ 4న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినా మనదేశం నుంచి మాత్రం సందర్శించే వీలుండదని వివరించారు.

4 eclipses in 2021 but only 2 can be visible in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News