Sunday, April 28, 2024

రహానే సూపర్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

రహానే సూపర్ సెంచరీ

తోడుగా నిలిచిన జడ్డూ, ఆకట్టుకున్న గిల్

ఆసీస్‌పై భారత్ ఆధిక్యత

IND vs AUS 2nd Test: India take 82 runs lead

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోభారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా రెండో రోజు బ్యాటింగ్‌లోను మంచి ప్రదర్శన చేసింది. కెప్టెన్ అజింక్య రహానే అజేయ శతకానికి తోడు రవీంద్ర జడేజా (40 పరుగులు నాటౌట్) నిలకడగా రాణించడంతో భారత్ ప్రస్తుత 82 పరుగులు ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఈక్రమంలో రెండోరోజు ఆట ముగిసే పమయానికి 5 వికెట్ల నష్టానికి 277 పరుగులతో నిలిచింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉండడం తో మూడో రోజు మరిన్ని పరుగులు చేసి ఆసీస్‌పై ఒత్తిడిని పెంచే స్థితిలో నిలిచింది. మూడో రోజు రహానే, జడేజాలు ఎంత సేపు కొనసాగుతారనే దానిపై ఆసీస్‌పై ఎంత ఒత్తిడి పెంచుతారనేది ఆధారపడి ఉంది.
నిరాశ పరిచిన పుజారా
ఓవర్‌నైట్ స్కోరు 1/36తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్ (45), పుజారా(17)లను కమిన్స్ వరస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించాడు. దీంతో టీమిండియా 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రహానే, హనుమ విహారి (21) నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. అప్పటికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులుగా ఉంది. భోజన విరామం తర్వాత కూడా కుదురుగా ఆడుతున్న విహారి లైయన్ బౌలింగ్ లో అనవసరపు షాట్ ఆడి ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వికెట్ కీపర్ పంత్(29) చక్కటి షాట్లతో రాణించాడు. రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో వీరిద్దరు 5వ వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. కుదురుకున్నట్లుగా కనిపించిన పంత్‌ను స్టార్క్ పెవిలియన్‌కు పంపించాడు. అతడు ఆడిన షాట్‌ను వికెట్ కీపర్ టిమ్ పైన్ అద్భుత డైవ్‌తో అందుకోవడంతో భారత్ అయిదో వికెట్ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా బరిలోకి దిగిన కొద్ది సేపటికే వర్షం కారణంగా రెండో సెషన్‌ను ముందు గా ముటించారు. అప్పటికి భారత్ 5 వికెట్ల నష్టానికి 189 పరుగులతో నిలిచింది.చివరి సెషన్‌లో రహానే, జడేజాలు పూర్తి ఆధిపత్యం సాధించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రహానే చూడచక్కటి ఇన్నింగ్స్ ఆడా డు. మరో వైపు జడేజా షాట్ల కోసం యత్నించకుండా సమయస్ఫూర్తితో అతనికి సహకరించాడు. సింగిల్స్ డబుల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో వీరిద్ద రూ ఆటనిలిచే సమయానికి ఆరో వికెట్‌కు 104 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసేందుకు కొద్ది క్షణాల ముందు రహానే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.అతని స్కోరులో 12 ఫోర్లున్నాయి. టెస్టుల్లో రహానేకు ఇది 12వ సెంచరీ కాగా కెప్టెన్‌గా తొలి సెంచరీ. అప్పుడే వర్షం కురవడంతో రెండో రోజు ఆట కొంత ముందుగానే ముగిసింది. అప్పటికి రహానే 104 పరుగులతో, జడేజా 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్‌సలు చెరి రెండు వికెట్లు పడగొట్టగా లైయన్‌కు ఒక వికెట్ దక్కింది.
250 వికెట్ల క్లబ్‌లో స్టార్క్
కాగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికా ర్డు సాధించాడు. రిషబ్ పంత్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 250వ వికెట్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమం లో ఆస్ట్రేలియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌కన్నా ముందు మాజీ దిగ్గజాలు డెన్నిస్ లిల్లీ(48 టెస్టు ల్లో), షేన్‌వార్న్, మెక్‌గ్రాత్(55 మ్యాచ్‌ల్లో), మిచెల్ జాన్సన్(57టెస్టుల్లో) ఈ ఘనత సాధించగా స్టార్క్ 58వ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరాడు.

IND vs AUS 2nd Test: India take 82 runs lead

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News