Sunday, April 28, 2024

40కే దిక్కులేదు.. 70 ఎలా గెలుస్తారు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 40చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కె.టి.రామారావు ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడా రు. ఈ సందర్భంగా కెటిఆర్ విలేకరులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాంగ్రెస్‌లో డబ్బులు ఇచ్చిన వా రికే టిక్కెట్లు ఇస్తున్నారని విమర్శించారు. కూకట్‌పల్లి సీటు కోసం రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత తన తో చెప్పారని కెటిఆర్ తెలిపారు. తాను చెప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోందని.. తెలంగాణకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.42 కోట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికిటన్లు పేర్కొన్నారు. రూ.8 కోట్లు ఇప్పటికే కొ డంగల్ చేరినట్టు సమాచారం ఉందని అన్నారు. గతంలో తాను చెప్పినట్లే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోందని పేర్కొన్నారు. అక్కడ స్కేర్ ఫీట్‌కు రూ.500 వసూలు చేస్తున్నారని చెప్పారు. తమ సిఎం అభ్యర్థి సిఎం కెసిఆర్ అని, కాంగ్రెస్, బిజెపి పార్టీలు వారి సిఎం అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ విసిరారు.

తాము ఇంకా నాలుగు స్థానాలను అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని, మూడు నాలుగు రోజుల్లో ఆ ని యోజకవర్గాలకు బిఆర్‌ఎస్ అభ్యర్థుల ను ప్రకటిస్తామని తెలిపా రు. రాష్ట్రంలో ని రుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకపోయామో యువత కు వి వరస్తామని చెప్పారు. నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొ న్నారు.తమను టార్గెట్ చే సేందుకు ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేవని పేర్కొ న్నారు. కాంగ్రెస్ సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికలు కొట్లాడటం లేదని విమర్శించారు. తాము తొమ్మిదిన్నరే ళ్లుగా చేసిన పను ల గురించి చెబుతున్నామని, ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నామని చెప్పారు. తమ కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు.

100 నియోజకవర్గాలలో సిఎం కెసిఆర్ ప్రచారం
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈసారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తారని కెటిఆర్ తెలిపారు. తాను జీహెచ్‌ఎంసీ, సిరిసిల్ల తో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనార్టీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. అట్టడుగు వర్గాలకు బిఆర్‌ఎస్ ఊత కర్ర లా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నామని తెలిపారు. అధికారుల బదిలీలను సాధారణ బదిలీలుగానే చూ స్తామని అన్నారు. సి రిసిల్లలో ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయొద్దని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. తమకు గతంలో మాదిరిగా 88 సీట్లు రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. హు జూరాబాద్ లో కూడా తా మే గెలుస్తున్నామని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ గజ్వేల్లోనే కాదు.. మరో 50 చోట్ల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని, షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా, రాహుల్ గాంధీ. మోడీ ఇక్కడికొచ్చి పోటీ చేసినా అ భ్యంతరం లేదని తెలిపారు. తా ము ప్రతీకార రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బిఆర్‌ఎస్‌లో చేర తానంటే ఆయన ఇంటికి వెళ్లి తానే ఆహ్వానిస్తానని కెటిఆర్ వెల్లడిం చారు. త్వర లో చాలా మంది ప్రముఖలు బిఆర్‌ఎస్‌లో చేరతారని అన్నారు. కాంగ్రెస్‌లో అ భ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ముఖ్య మంత్రి పదవి కి ఇద్దరు నేతల మధ్య అంగీకా రం కుదిరినట్టు తనకు సమాచారం ఉందని కెటిఆర్ తెలిపారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని.. రాసిచ్చిందే చదువుతారని మంత్రి కెటిఆర్ వి మర్శించా రు. ఈ ఎన్నికలు తెలంగాణ తల్లి ఆత్మగౌర వానికి, ఢిల్లీ.. గుజరాత్ అహంకారానికి మ ధ్య పోటీ అని పేర్కొన్నారు. అమిత్ షా అబద్ధా లకు హద్దే లేదని, తనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ ని వారి నాయకత్వమే సీరియస్‌గా తీసుకోవ డం లేదని, ఆ పార్టీ ఈసారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయ మని వ్యాఖ్యా నించారు. బిజెపి పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవు తుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోడీని ఎందుకు తిడతామని అన్నారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఐటీ, ఇడి దాడులు ఎందుకు చేయటంలేదు..? అని కెటిఆర్ ప్రశ్నించారు.

లోకేష్ ట్వీట్ బాధ కలిగించింది..
చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబా బు భద్రత విషయంలో కుమారుడిగా లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా తాను అ ర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. తండ్రి ఆరోగ్యంపై కొడుకు ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసు అని పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవని, లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి బాధాకరమని అన్నారు. చంద్రబాబు భద్రతకు ప్రమాదం జరిగితే రాజకీయల్లో అది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజకీయలు వేరు అయినా అయన కుటుంబం భాదను అర్ధం చేసుకోగలనని చెప్పారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు కెటిఆర్ సానుభూతి తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయం లో ఆయన ఆరోగ్యంపై తాము కూడా చాలా ఆందోళన చెందామని గుర్తు చేసుకున్నారు.కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు తమను తీవ్ర స్థా యిలో హెచ్చరించారని, ఇలాంటి సందర్భాల్లో మానసిక స్థ్ధితిలో ఉంటుందో తాను అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలకు విఘాతం కలగవద్దనే ఇక్కడ ఆందోళన చేయవద్దని చెప్పానని అన్నారు.

Lokesh tweet

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News