Sunday, April 28, 2024

కైరో చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41మంది సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

41 killed as fire broke out in Cairo Church

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని కాప్టిక్ చర్చిలో ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించి 41మంది సజీవ దహనమయ్యారు. మరో 14మంది గాయాలపాలయ్యారు. ఇంబాబా లోని జన సమ్మర్థం కలిగిన పరిసరాల్లో ఉండే అబూ సెఫీన్ చర్చిలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్లనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 అగ్నిమాపక యంత్రాలు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. గాయపడిన వారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్డెల్ ఫతా సిసి ఈ ప్రమాద సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాప్టిక్ క్రిస్టియన్ చర్చిపోప్ తవాడ్రోస్‌కి ఫోన్ చేసి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

41 killed as fire broke out in Cairo Church

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News