Sunday, April 28, 2024

తెలంగాణ రైతు కంట పన్నీరు

- Advertisement -
- Advertisement -

రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు

రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు జరగగా 2019లో 491కి పడిపోయినట్టు వెల్లడి, రైతుబంధు తదితర కెసిఆర్ విధానాలు, వినూత్న కార్యక్రమాల వల్లనే ఈవిజయం సాధ్యమైందని నిపుణుల ధ్రువీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న రైతుబంధు, రుణమాఫీ, గిట్టుబాటు ధరలకు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా అన్నదాతలు ఆత్మహత్యలకు దూరంగా జరుగుతున్నారని నిరూపితమైంది. మంగళవారం కేంద్ర ప్రభుత్వమే లోక్‌సభలో చేసిన ప్రకటన అందుకు తార్కాణంగా నిలుస్తోంది. 2017 నుంచి 2019 నడుమ అంటే మూడేళ్ల కాలంలో దేశంలోనే అత్యంత తక్కువగా రైతన్నల మరణాలు తెలంగాణలో చోటుచేసుక్నున్నాయని పేర్కొంది. తెలంగాణలో 2017లో 846 మంది ఆత్మహత్య చేసుకుంటే 2018లో 900 మంది మరణాన్ని ఆశ్రయించారు. 2019లో మాత్రం ఆ సంఖ్య గణనీయంగా తగ్గి 491కి తగ్గిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కేం ద్రం వెల్లడించింది. రైతు ఆత్మహత్యలు తగ్గించగలిగిన రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అక్కడ 2017లో 429మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా 2019నాటికి అది 142కు పడిపోయింది.

ఇక బిజెపి పాలిత కర్నాటకలో రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయింది. 2017లో అక్కడ 1157మంది ఆత్మహత్యను ఆశ్రయించగా… 2019లో 1331మంది బలవన్మరం చెందారు. ఇక ఈ మూడేళ్ల కాలంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రా ల్లో రైతు మరణాలేవీ చోటుచేసుకోలేదని కేంద్రం ప్రకటించింది. ఇక 2017లో దేశవ్యాప్తంగా 5,955 మంది రైతులు బలవన్మరణం చెందారని, 2018లో 5,763, 2019లో 5,957 మంది రైతుల ఆత్మహత్యలు చేసుక్నునారని తెలిపింది. సుమారు 40లక్షల మంది రైతులకు రూ.52వేల కోట్లు రుణ మాఫీ చేసినట్లు వివరించింది.
రైతుబంధు కీలక పాత్ర….
అన్నదాతల ఆత్మహత్యలను చెప్పుకోతగ్గ స్థాయిలో తెలంగాణలో తగ్గడానికి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు(నగదు బదిలీ) పథకం కీలక పాత్ర పోషించిందని వ్యవసాయ కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు. ‘తెలంగాణలో రైతుబంధు ఆత్మహత్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా అక్కడి రైతులు మద్దతు ధర పలికే పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పత్తి, ధాన్యాన్ని అధికంగా పండిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఒక్క రైతులనే కాదు, దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీల చావులను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి జి.రామాంజనేయులు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిని ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

491 Farmers suicide in 2019 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News