Tuesday, April 30, 2024

మణప్పురంను ముంచిన నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

11 Arrested for sexual harassment in Maharashtra

మణప్పురంను ముంచిన నిందితుల అరెస్టు
పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన నిందితుడు
ఒడిసాకు చెందిన ఐదుగురి అరెస్టు
గోల్డ్ లోన్ పేరుతో రూ.30లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న నిందితులు

మనతెలంగాణ/హైదరాబాద్: పై అధికారులం మాట్లాడుతున్నామని చెప్పి నగరంలోని హిమాయనగర్ బ్రాంచ్ మనప్పురం ఫైనాన్స్ అధికారులను మోసం చేసి డబ్బులు దోచుకున్న నిందితులను నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఒడిసా రాష్ట్రం, భువనేశ్వర్‌కు చెందిన ఆదిత్య నారాయణ్ మహాపాత్ర అక్కడి ముత్తూట్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నాడు. లక్ష్మీధర్ మురుము, ప్రమోద్ నాయక్, సౌమ్య రంజన్ పట్నాయక్, విద్యార్థి, దేబాషిష్ ఓజ్‌హ. ఐదుగురు కలిసి ముత్తుట్ ఫైనాన్స్ నుంచి డబ్బులు దోచుకున్న కేసులో నిందితులు. ఇందులో ప్రధాన నిందితుడు ఆదిత్య నారాయణ్ మహాపాత్ర. అతను ముత్తూట్‌లో పనిచేస్తుండడంతో అన్ని విషయాలు తెలుసు. మనప్పురంలో గోల్డ్ రుణాలు సులభంగా తీసుకోవచ్చని తెలుసుకుని ప్లాన్ వేశాడు. హిమాయత్‌నగర్‌లోని మనప్పురం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఫోన్ చేసి ఇద్దరు ఉద్యోగుల క్రెడెన్షియల్స్ తీసుకున్నాడు. నకిలీ కస్టమర్ల పేర్లతో గోల్డ్ లోన్ కోసం అప్లికేషన్ పెట్టాడు. తర్వాత ప్రధాన నిందితుడు గోల్డ్‌లోన్‌కు అఫ్రూవ్ ఇచ్చాడు.

దీనిని ఇద్దరు సంస్థ ఉద్యోగుల అనుమతి కావాల్సి రావడంతో హిమాయత్‌నగర్ ఉద్యోగుల క్రెడెన్షియల్స్ తీసుకుని ఆమెదింపజేశాడు. ఫోన్ చేసి తాను హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పడంతో ఇద్దరు ఉద్యోగుల క్రెడెన్షియల్స్ చెప్పారు. గోల్డ్ లోన్ అప్రూవ్ కావడంతో రూ.30లక్షలు రుణం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత హిమాయత్‌నగర్ బ్రాంచ్ ఉద్యోగులు తమకు మెయిన్ బ్రాంచ్ నుంచి ఫోన్ రాలేదని తెలుసుకుని నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఒడిసాకు చెందిన ఐదుగురు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

5 Accused arrested for money stolen from Muthoot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News