Tuesday, April 30, 2024

ఆన్‌లైన్‌లో ఆటో బుకింగ్‌పై 5 శాతం జీఎస్టీ

- Advertisement -
- Advertisement -

5% GST on online auto booking

1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన
ఆందోళనలో ఆటో కార్మికులు

హైదరాబాద్ : కరోనా పరిణమాలతో అన్ని రంగాలకు కంటే ట్రాన్స్‌పోర్టు రంగం మరింత నష్టాల బాట పట్టింది. ఇప్పడిప్పుడే ఆర్‌టిసి కోలుకుంటున్నా దాని తర్వాత గ్రేటర్ ప్రజల రవాణా అవసరాలు తీరుస్తున్న అతిపెద్ద ప్రైవేట్ రవాణ వ్యవస్థ అయిన ఆటోకార్మికులు మాత్రం ఇంకా నష్టాలు చవిచూస్తూనే ఉన్నారు.పెట్రల్, డిజీల్ ధరల, సీఎన్జీ ధరలు పెరగడంతో వారు మరిన్ని ఆర్దిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తాము పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వారు యాప్‌ఆధారాతి సేవలు ( ఉబర్, ఓలా) మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1 లక్షా 30 వేల ఆటోలు ఉండగా వాటిలో సుమారు 50 నుంచి 60 శాతం యాప్‌ఆధారిత సేవలవైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణ ఆటో సవారీలకు ప్రయాణికుల నుంచి అంతగా డిమాండ్ లేక పోవడంతో వారు తమ ఆటోలను ఆన్‌లైన్ ఆటో సేవల కిందకు మార్చుకుంటున్నారు. సాధారణ ఆటోలతో పోలిస్తే పెద్దగా ఆదాయం లేక పోయినప్పటికి ఖాళీగా ఉన్నసమయంలో మాత్రం వారు యాప్‌ఆదారిత సేవలవైపు మొగ్గు చూపుతున్నారు.

ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వారి ఆదాయాన్ని దెబ్బకొట్టే విధంగా నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా ఆటోలు బుక్ చేసుకునే ప్రయాణికులు తప్పనిసరిగా జనవరి 1 నుంచి 5 శాతం జిఎస్టీ చెల్లించాలనే నిబంధన విధించడంతో ఉబర్, ఓలా ఆటోలను బుక్ చేసుకునే సాధారణ ప్రయాణికులపై భారం పడుతుండటంతో ఆటోయజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్‌నే వృత్తిగా నమ్ముకుని తాము ఈ రంగంలోకి వచ్చామని, ఇది తప్ప మరొక వ్యాపకం లేని తమను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి జిఎస్టీపేరుతో చార్జీలు వసూలు చేయడం సరికాదంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రత్యక్షంగా తమపై ఎటువంటి ప్రభావం చూపనప్పటికి అది ప్రయాణికులకు భారంగా మారుతుందని ఇటువంటి సమయంలో వారు తమ సేవలను వినియోగించుకునేందుకు ముందుకు రారని తద్వారా తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మరింత నష్టపోతాం : ఆర్ల సత్తిరెడ్డి

యాప్ ఆధారిత రవాణా సేవలు అందిస్తున్న ఆటోలపై 5 శాతం జిఎస్టీ వసూలు చేస్తే తాము నష్టపోతామని ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు ఆర్లసత్త రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయని ఇటువంటి సమయంలో యాప్ ఆధారిత సేవలపై 5 శాతం జిఎస్టీ అంటే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటురాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ సేవలపై విధించే 5 శాతం అంశంపై పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News