Sunday, April 28, 2024

యుపి, పంజాబ్‌లలో బిజెపికి షాక్ తప్పదు

- Advertisement -
- Advertisement -
Kadiyam Srihari Sensational Comments on BJP
బిజెపిపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: టిఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎంఎల్‌సి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపికి వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ దెబ్బకు బిజెపి ఓడిపోతుందన్నారు. పంజాబ్‌లో ఆప్ చేతిలో ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ చేతిలో బిజెపి ఓటమి పాలైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాని మోడీ, అమిత్‌షా కాళ్లు విరగడం ఖాయమని దుయ్యబట్టారు.

ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ప్యాకేజీలు ప్రకటించడం బిజెపికి అలవాటైందని విమర్శించారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవుతూ వస్తుందని ఆయన చురకలు వేశారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైందని.. మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధికారాన్నిప అడ్డుపెట్టుకుని అధికారం సాధించారని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. కెసిఆర్ ఎక్కడ యాంటీ బిజెపి కూటమి ఏర్పాటు చేస్తారనే భయం బిజెపికి పట్టుకుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కచ్చితంగా యాంటీ బిజెపి పార్టీలన్నీ ఏకమవుతాయని కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.
బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వల్ల

తెలంగాణకు ఒక్క ప్రయోజనం కూడా చేకూరలేదు

తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాల్సిన బిజెపి నాయకులు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని.. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేలేని బిజెపి నేతలు ఎందుకు ఎగిరిపడుతున్నారని ఆయన మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా బిజెపి నేతలు సాధించలేకపోయారని కడియం శ్రీహరి విమర్శించారు. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వల్ల తెలంగాణకు ఒక్క ప్రయోజనం కూడా చేకూరలేదని ఆయన మండిపడ్డారు.

ఎనిమదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది

ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. సంక్షేమ రంగంపై 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు. అభివృద్ధికి సహకరించాల్సిన బిజెపి నాయకులు మోకాలడ్డుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తప్పొప్పులపై మాట్లాడాలి తప్ప, వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతున్నారన్నారు. కేంద్రం పనితీరు వల్ల దేశంలో అసమానతలు పెరిగాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలని మూసివేసి నిరుద్యోగ సమస్యను పెంచారన్నారు.

రైతు సంక్షేమానికి బిజెపి కట్టుబడి ఉంది

తెలంగాణ అభివృద్ధిపై బిజెపి మంత్రులే ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. రైతు సంక్షేమానికి టిఆర్‌ఎస్ కట్టుబడిందని స్పష్టం చేశారు.8 విడతల్లో 80 వేల కోట్లను రైతుబంధు కింద ఇచ్చామని, ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం కెసిఆర్‌కే సాధ్యమని కడియం శ్రీహరి ప్రశంసించారు.

రైతు, దళిత వ్యతిరేక పార్టీ బిజెపిని బొందపెట్టాలి

బిజెపి రైతు, దళిత వ్యతిరేక పార్టీ, అలాంటి పార్టీని బొందపెట్టాలి.. చౌకబారు రాజకీయాలు మానండని బిజెపి నేతలకు హితవు చెప్పారు. రాబోయే రోజుల్లో యాంటీ బిజెపి ఫోర్స్ ఏకమవుతాయని.. ఏ రూపంలో కలిసి పనిచేయాలో తమ బాస్ డిసైడ్ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News