Wednesday, May 15, 2024

పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

5 Killed in Road Accident at Pune-Ahmednagar Road

పూణె: మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో శిక్రాపూర్ సమీపంలో పుణె-అహ్మద్‌నగర్‌ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. కారు, మరో రెండు మోటర్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపు మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

5 Killed in Road Accident at Pune-Ahmednagar Road

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News