Saturday, May 4, 2024

పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

నాగపూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన కాల్పుల పోరులో ఐదుగురు నక్సల్స్ మరణించారు. నక్సల్స్ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఖోబ్రమెండ అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల పోరు జరిగినట్లు ఆయన చెప్పారు. కాగా, శనివారం గడ్చిరోలి పోలీసులకు ఒక రైఫిల్, మూడు ప్రెషర్ కుకర్ బాంబులు లభించాయి. భద్రతా దళాలపై మెరుపుదాడికి వీటిని ఉపయోగించాలని నక్సల్స్ వ్యూహం పన్నినట్లు పోలీసులు శనివారం అనుమానం వ్యక్తం చేశారు.

నక్సల్స్ వారోత్సవాల సందర్భంగా హెటల్‌కాసా అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో నక్సల్స్ సమావేశమవుతున్నట్లు సమాచారం అందుకున్న గడ్చిరోలి పోలీసులు శనివారం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 60-70 మంది నక్సల్స్ పోలీసు కమాండోలపై కాల్పులు ప్రారంభించారని, ఇందుకు ప్రతిగా కమాండోలు కూడా కాల్పులు జరిపారని పోలీసు అధికారి చెప్పారు. దాదాపు గంటసేపు పోరు అనంతరం నక్సల్స్ అక్కడి నుంచి తప్పించుకున్నారని, పోలీసుల కాల్పులలో ఐదుగురు నక్సల్స్ మరణించినట్లు ఆయన చెప్పారు. పరారైన నక్సల్స్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

5 Naxals killed in Encounter in Gadchiroli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News