Saturday, May 4, 2024

కొ-విన్‌లో 50 లక్షల మంది నమోదు

- Advertisement -
- Advertisement -

50 lakh registered in Co-Win

 

2.08 లక్షల మందికి మొదటి డోస్

న్యూఢిల్లీ: కొవిడ్19 నియంత్రణ కోసం రెండోదశలో దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్ట ల్ ద్వారా 50 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. వీరిలో 2,08,791మందికి మొదటి డోస్ టీకా ఇచ్చినట్టు తెలిపిం ది. రెండోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియను మార్చి 1నుంచి కేంద్రం చేపట్టింది. ఈ దశలో 60 ఏళ్లు నిండినవారితోపాటు 4560 మధ్య వయస్కుల్లోని తీవ్ర వ్యాధులతో బాధపడేవారికి టీకాలు ఇస్తున్నారు. కోవిన్‌లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి నమోదు ప్రక్రియ మొదలైంది. మొదటిదశలో మొత్తం 1,48,55,073మందికి టీకాలిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు వీరిలో రెండు డోసులు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు 25,98,192మంది కాగా, ఒక్క డోసు తీసుకున్నవారు 67,04,856మంది. ఒక్క డోసు తీసుకున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లు 53,43,219మంది.

19 రాష్ట్రాల్లో మరణాల్లేవు : ఆరోగ్యశాఖ

దేశంలో మంగళవారం ఉదయం 8 గంటలవరకల్లా 24 గంటల్లో 12,286 కరోనా కేసులు నమోదు కాగా, 12,464మంది కోలుకున్నారు. 91మంది మరణించా రు. మరణాల్లో మహారాష్ట్ర నుంచి 30, పంజాబ్ నుంచి 18 ,కేరళ నుంచి 16 నమోదయ్యాయి. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. కొత్త కేసుల్లో 80.33 శాతం 5 రాష్ట్రాల నుంచే నమోదయ్యాయి. వాటి లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్,తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి. మొత్తం కేసులు 1,11,24,527, రికవరీలు 1,07,98,921 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,358. దీంతో, రికవరీ రేట్ 97.07 శాతంగా, యాక్టివ్ కేసుల రేట్ 1.51 శాతంగా నమోదైంది.

57 మంది విద్యార్థులకు కరోనా

చండీగఢ్: హర్యానాలోని కర్నాల్ జిల్లా కుంజుపురాలోని సైనిక పాఠశాల హాస్టల్‌లో 57మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. సోమవారం హాస్టల్‌లోని ముగ్గురు విద్యార్థులు అనారోగ్యానికి గురి కాగా, వారికి పరీక్షలు జరపడంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో, హాస్టల్‌లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించారు. మరో 54మంది విద్యార్థులు కరోనాబారిన పడ్డ ట్టు తేలింది. దాంతో,హాస్టల్‌ను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. హాస్టల్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వైద్య బృందాలు అక్కడికి చేరుకొని విద్యార్థులకు వైద్య సేవలందిస్తున్నాయి. హర్యానాలో గతేడాది డిసెంబర్‌లో 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసులు ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుంచి 3నుంచి 5 తరగతులకు క్లాసులు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News