Friday, May 3, 2024

కోహ్లి ఖాతాలో మరో రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ రికార్డు క్రికెట్‌లో కాకుండా వ్యక్తిగతంగా సాధించాడు. కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీత ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజా గా విరాట ఇనస్టాగ్రామ్‌లో పది కోట్ల మం ది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్‌లోనే కాకుండా ఆసియాలోనే ఈ ఘనత సాధించిన తొలి సెలబ్రిటిగా కోహ్లి అవతరించాడు. ఇదే స మయంలో ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా కోహ్లి నిలిచాడు. కాగా విరాట్ రికార్డు సాధించిన విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ట్వీటర్‌లో వెల్లడించింది.

Kohli get 100 Million Record Insta followers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News