Wednesday, December 4, 2024

ఇకపై ఆటపైనే పూర్తి దృష్టి పెడతా: జో రూట్

- Advertisement -
- Advertisement -

లీడ్స్: లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఎదురైన ఓటమి తమకు ఓ గుణపాఠం లాంటిదని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అభిప్రాయపడ్డాడు. లార్డ్ టెస్టు తమకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నాడు. ఆ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నామని పేర్కొన్నాడు. ఇకపై ఆటపైనే పూర్తి దృష్టి పెడతామని, ఇతర విషయాల జోలికి వెళ్లమని రూట్ స్పష్టం చేశాడు. మూడో టెస్టును పురస్కరించుకుని నిర్వహించిన మీడియా సమావేశంలో రూట్ మాట్లాడాడు. లార్డ్ మ్యాచ్‌లో తాము కీలక సమయంలో భారత ఆటగాళ్లను రెచ్చగొట్టి భారీ మూల్యమే చెల్లించుకున్నామన్నాడు. ఒకవేళ కవ్వింపు చర్యలకు పోకుండా సహాజ సిద్ధమైన ఆటను కొనసాగించి ఉన్నట్లయితే లార్డ్ మ్యాచ్‌లో తమకే విజయం లభిస్తుందనడంలో ఎలాంటి లేదన్నాడు.

అయితే అనవసర వివాదాలు కొనితెచ్చుకుని గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నామని రూట్ వాపోయాడు. ఇకపై ఇలాంటి పొరపాట్లకు తావుండదన్నాడు. మిగిలిన మ్యాచుల్లో తాము నిజాయితీగా ఉండాలనుకుంటున్నామన్నాడు. మూడో టెస్టులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సహాజ సిద్ధమైన క్రికెట్‌ను ఆడేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఇక భారత్‌లాంటి జట్టుతో పోరు ఎప్పటికీ క్లిష్టంగానే ఉంటుందన్నాడు. టీమిండియాను ఓడించాలంటే అసాధారణ ఆటను కనబరచక తప్పదన్నాడు. ఇక మిగిలిన మ్యాచుల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామని రూట్ పేర్కొన్నాడు.

Joe Root Press Conference ahead of 3rd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News