Monday, May 6, 2024

రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా

- Advertisement -
- Advertisement -

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు మాట్లాడుతూ “సుధీర్ బాబు బర్త్ డే రోజున సినిమా సాంగ్ రిలీజ్ చేశాం. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. అప్పటి నుంచి మా సినిమా బిజినెస్ ప్రారంభమైంది. సినిమా షూటింగ్ అయిపోయే లోపు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బిజినెస్ కూడా పూర్తయింది. మేము మొదట ఈ సినిమాకు ‘నల్ల వంతెన’ అని టైటిల్ అనుకున్నాము. కానీ మేము చేసే లవ్ స్టోరీకి ఈ టైటిల్ క్యాచీగా లేదని సెకండ్ ఆప్షన్‌గా ‘శ్రీదేవి సోడా సెంటర్’ టైటిల్‌ను ఫిక్స్ చేశాము.

ఈ షాపు చుట్టూ జరిగే స్టోరీ కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమాలో రియల్ క్యారెక్టర్స్ ఉంటాయి. మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇది పూర్తిగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సినిమా. ఇక సుధీర్ బాబుతో మేము సెట్‌లో ఉన్నపుడు హీరో, ప్రొడ్యూసర్‌లా ఉంటాము. షూట్ అయిన తరువాత ఫ్రెండ్స్‌లా ఉంటాము. అలా ఉండకపోతే సినిమా చేయలేము. ఈ సినిమాకు మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి సపోర్ట్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27న వస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ అందరికీ తప్పక నచ్చుతుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News