Thursday, May 2, 2024

దేశంలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు

- Advertisement -
- Advertisement -

5424 Black Fungus cases reported in 18 states

న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. బ్లాక్ ఫంగస్, కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన మంత్రుల బృందం భేటీ అయింది. దేశంలో ఇప్పటివరకు 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసుల్లో 4,556 మంది కరోనా బాధితులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ బాధితుల్లో 55శాతం మంది మధుమేహగ్రస్తులు ఉన్నారని కేంద్రమంత్రి తెలిపారు. 18 రాష్ట్రాలు, కేంద్రప్రాలిత ప్రాంతాల్లో బ్లాంక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయన్నారు. బ్లాక్ ఫంగస్ ను రాజస్థాన్, బీహార్, గుజరాత్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో దీనిని గుర్తించబడిందని ఆయన పేర్కొన్నారు.

5424 Black Fungus cases reported in 18 states

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News