Tuesday, May 7, 2024

యుపిలో వెలుగుచూసిన మరో ఫంగస్

- Advertisement -
- Advertisement -

yellow fungus case reported in Ghaziabad

న్యూఢిల్లీ: దేశంలో మరో ఫంగస్ వెలుగుచూసింది. భారత్ లో ఇప్పటివకే పెరుగుతున్న బ్లాక్, వైట్ ఫంగస్ సంక్రమణ కేసుల మధ్య, యెల్లో ఫంగస్ మొదటి కేసు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నమోదైంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ రెండింటి కంటే యెల్లో ఫంగస్ ప్రమాదకరమైనదని తెలిసింది. కొత్త ఫంగస్ సోకిన వ్యక్తి ఇఎన్ టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. యెల్లో ఫంగస్ లక్షణాలు బద్ధకం, తక్కువ ఆకలి, లేదా ఆకలి లేకపోవడం,బరువు తగ్గడం వంటివి ఉంటాయని వైద్యులు వెల్లడించారు. ఫంగస్ మరింత తీవ్రమైన లక్షణాలు చీము లీకేజ్, కళ్ళు ముసుకుపోయి, అవయవ వైఫల్యానికి దారితీస్తూ చివరికి నెక్రోసిస్‌కు దారితీస్తుందని వైద్యులు తెలిపారు. యెల్లో ఫంగస్ ఒక ప్రాణాంతక వ్యాధి, ఎందుకంటే ఇది అంతర్గతంగా మొదలవుతుందని సమాచారం. ఏదైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, దేశంలో 5,424 కేసులలో, 4,556 మంది కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ సోకిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

yellow fungus case reported in Ghaziabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News