Tuesday, May 14, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో 600 కిలోల ఆహార ప్యాకెట్లు

- Advertisement -
- Advertisement -
జారవిడిచిన ఐఎఎఫ్ హెలికాప్టర్లు

హైదరాబాద్ : రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు 600 కిలోల ఆహార ప్యాకెట్లను జారవిడిచాయి. నిరాశ్రయులైన పలు గ్రామాల్లోని ప్రజలకు శుక్రవారం హెలికాప్టర్లు ద్వారా ఆహార ప్యాకెట్లును అందించారు. ఆహార ప్యాకెట్లలో ’సాంగినీస్’గా ప్రసిద్ధి చెందిన ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందించిన రిలీఫ్ మెటీరియల్ ఉన్నాయి. ప్రకృతి విధ్వంసం సృష్టించినప్పుడల్లా ఐఎఎఫ్ సిబ్బంది తమవంతు సహాయం అందిస్తున్నారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన హెలికాప్టర్లు భూపాలపల్లి జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో ఈ ఆహార ప్యాకెట్లను జారవిడిచాయి. అదే విధంగా నైనపాక గ్రామంలో జెసిబిపై చిక్కుకుపోయిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భారత వైమానిక దళం సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారుల వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News