Sunday, April 28, 2024

ఆయుధాలకు పదును

- Advertisement -
- Advertisement -

60000 Chinese troops on northern border of India

 

భారత్ ఉత్తర సరిహద్దుల్లో 60వేల మంది చైనా బలగాలు

క్వాడ్ దేశాలకు పక్కలో బల్లెంలా డ్రాగన్ : అమెరికా

4 రోజులకో క్షిపణి పరీక్ష ఇప్పటికే 10 ప్రయోగాలు
గురి తప్పకుండా ఆయుధాల విజయవంతం చైనా, పాక్‌లతో
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వరుస ప్రయోగాలు
కీలక పాత్ర పోషిస్తున్న డిఆర్‌డిఒ

నాలుగు రోజులకో క్షిపణి పరీక్ష జరుపుతున్న భారత్

ఆయుధాల రేస్‌లో స్పీడ్

సత్తా చాటుతున్న డిఆర్‌డిఒ

నెల రోజుల వ్యవధిలో ప్రయోగాలు
సెప్టెంబర్ 7 : హైపర్‌సానిక్ డెమోన్‌స్ట్రేటర్ వెహికిల్
సెప్టెంబర్ 22 : అభయ్ హైస్పీడ్ ఎక్సాండబుల్ ఏరియల్ టార్గెట్
సెప్టెంబర్ 22 : లేజర్ గైడెడ్ క్షిపణి విధ్వంసక ట్యాంకు
సెప్టెంబర్ 23 : పృథ్వీ2 రాత్రి ట్రయల్
సెప్టెంబర్ 30 : బ్రహ్మోస్ సూపర్ సానిక్ మిసైల్
అక్టోబర్ 01 : లేజర్‌గైడెడ్ క్షిపణి విధ్వంసక ట్యాంకు
అక్టోబర్ 03 : సూపర్‌సానిక్ శౌర్య క్షిపణి
అక్టోబర్ 05 : సూపర్‌సానిక్ టార్పెడో క్షిపణి
అక్టోబర్ 09 : యాంటీ రేడియేషన్ మిసైల్ (రుద్రం1)
అక్టోబర్ 10 : రుస్తుం2 ప్రొటోటైప్ డ్రోన్

న్యూఢిల్లీ : మనదేశం ఇప్పుడు ఆయుధ సుసంపన్న మహాభారత్‌గా రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది. ప్రతి నాలుగురోజులకోసారి అత్యంత సునిశిత, శక్తివంతమైన క్షిపణులను పరీక్షించి, విజయవంతంగా వాటి సమర్థతను బేరీజువేసుకుంటున్నారు. చైనాతో లద్థాఖ్ వెంబడి వాస్తవాధీన రేఖ ఇప్పుడు చాలాకాలంగా పొరుగుదేశం చైనా కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతల నిలయంగా మారింది. దౌత్య సైనిక స్థాయి చర్చలతో కొంత సంయమనం ఏర్పడ్డా, ఎప్పుడేం జరుగుతుందో తెలియని సంఘర్షణాయుత వాతావరణ నెలకొంది. ఇరుదేశాల బలగాలు ముందుకు అడుగువేయడం లేదు. అదే సమయంలో వెనకకు కూడా వెళ్లడం లేదు. రానున్న శీతాకాలం చైనా సరిహద్దులలో మన భూభాగాల పరిరక్షణలో అంకితభావంతో ఉండే సైనిక బలగాలకు వాతావరణపరంగా అత్యంత గడ్డు పరిస్థితి ఉంటుంది. దీనిని తట్టుకుని నిలబడేందుకు, మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత అధునాతన ప్రక్రియలతో పలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో క్షేత్రస్థాయిలోమన వాయుదళం బలోపేతానికి పలు అధునాతన క్షిపణులు, సంబంధిత వ్యవస్థల పరీక్షలు నిర్వహించారు. ఇండియా ఇప్పుడు చైనాతో పూర్తి స్థాయిలో ఆయుధ వ్యవస్థ బలోపేతం దిశలో పోటాపోటీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో చైనా కన్నా మన దేశ బలగాలు ఆయుధసంపత్తిలో పైచేయిగా ఉన్నట్లుగా కూడా నిర్థారణ అవుతోంది. ఈ విషయాన్ని ఇటీవలే భారత వైమానిక దళాధినేత భదౌరియా కూడా తెలిపారు.

వచ్చేవారంలోనే నిర్భయి క్రూయిజ్ మిస్సైల్

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) వచ్చే వారం తొలిరోజుల్లోనే అత్యంత అధునాతన నిర్భయ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించనుంది. ఇది శబ్ధవేగాన్ని మించి దూసుకువెళ్లుతుంది. 800 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను చీల్చిచెండటానికి ఈ క్షిపణి అన్నివిధాలుగా శక్తిని సంతరించుకుంది. ఇది పటిష్టమైన రాకెట్ బూస్టర్ మిస్సైల్‌గా ఉంటుంది. దీనిని పరీక్షించి తరువాతి క్రమంలో సైనిక దళానికి అందుబాటులోకి తెస్తారు. ఆర్మీకి, నేవీకి దీని సేవలు అందుతాయని సైనిక వర్గాలు అనధికారికంగా తెలిపాయి.

35 రోజులలో పదవ ప్రయోగం

భారతదేశపు అత్యంత ప్రఖ్యాత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్‌డిఒ గత 35 రోజులుగా సాగిస్తూ వస్తున్న మిస్సైల్స్ ప్రయోగాలలో నిర్భయ ప్రయోగం పదవ ప్రయోగంగా నిలుస్తుంది. డిఆర్‌డిఒ దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా వ్యవహరిస్తూ రూపొందిస్తూ వస్తున్న పలు పూర్తిస్థాయి దేశీయ క్షిపణులను తగు విధంగా పరీక్షించి వాటి సమర్థతను నిర్థారించిన తరువాత వాటిని క్రమేపీ రక్షణ దళాల సేవలోకి అందుబాటులోకి తెస్తున్నారు. ఎల్‌ఎసి నుంచి బలగాలను వెనకకు మళ్లించేది లేదని చైనా స్పష్టం చేయడంతో భారతదేశం అనివార్యంగా తమ వివిధ స్థాయిల బలగాలను బలోపేతం చేసుకోవల్సి వచ్చింది. ఈ క్రమం లో వాయుదళం పటిష్టతకు రంగం సిద్ధం అయింది. అత్యంత ఎతైన పర్వత శ్రేణువుల మధ్య నెలకొని ఉండే సరిహద్దులలోని యుద్ధ స్థావరాలలో వైమానిక దళం ఆద్యంతం చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే పలు రకాలైన క్షిపణులను ఇటీవలి కాలంలో పరీక్షిస్తూ వస్తున్నారు.

ప్రతి నాలుగురోజులకో క్షిపణి ప్రయోగం అత్యంత అరుదైన అసాధారణ రికార్డుగా మారింది. భారత్‌లో తయారీ మే కిన్ ఇండియా లక్షాన్ని పరిగణనలోకి తీసుకుంటూ డిఆర్‌డిఒ బహుముఖ మిస్సైల్స్ సంబంధిత ఆయుధ వ్యవస్థల రూపకల్పన దిశలో అనుక్షణం నిమగ్నం అయింది. ఈ దిశలో హైదరాబాద్‌లోని డిఆర్‌డిఒతో పాటు పలు రక్షణ శాఖ పరిధిలోని పరిశోధనా సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. అత్యంత వ్యూహాత్మక సుదూర లక్షాల ఛేదక అణ్వాయుధ సంసన్న క్షిపణులు, సాంప్రదాయక క్షిపణుల తయారీకి డిఆర్‌డిఒ సైంటిస్టులు, సాంకేతిక సిబ్బంది పాటుపడుతోంది.

శత్రువుల స్థావరాలను దెబ్బతీయడం, శత్రువుల మిస్సైల్స్ వ్యవస్థల్లోని అణుధార్మికతను పనిచేయకుండా చేయడం, సముద్ర గర్భంలోని అవాంఛనీయ జలాంతర్గాములను అత్యం త అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పసికట్టి వాటి పనిపట్టడం కోసం పలు క్షిపణులను రూపొందించారు. సరిహద్దులు ప్రధాన కేంద్రంగా చేసుకుని సాగుతోన్న ఆయుధాల పరుగుపందెంలో భారత్ తన వేగాన్ని క్రమేపీ పుంజుకొంటోంది. ఓ వైపు అత్యంత ప్రామాణిక ప్రపంచ స్థాయి యుద్ధ విమానాలు రాఫెల్స్ వాయుసేనకు అదనపు శక్తి గా మారాయి. ఇదే సమయంలో క్షిపణి వ్యవస్థ బలోపే తం అవుతోంది. మనం ముందు దెబ్బతీయడం జరగదు, అయితే ఇతరులు దెబ్బతీస్తే దెబ్బతీసేందుకు యత్నిస్తే ఊరుకోవడం కుదరదనే నినాదంతో స్వదేశీ మేకిన్ ఇండియా వంటి అంతర్లీన ప్రాయోజితక కార్యక్రమాల నేపథ్యంలోనే రక్షణ ఉత్పత్తులు ఇనుమడిస్తున్నాయి.

తొలుత పరీక్షించింది హైపర్‌సోనిక్ వెహికల్

సంప్రదింపులు పర్వంలో చైనా చిత్తశుద్ధి సరిగ్గా లేదని, ఎప్పటికైనా డ్రాగన్‌తో ముప్పు ఉంటుందనే గుర్తించి భారత ప్రభుత్వం మన ఆయుధ సంపత్తి బలోపేతానికి సంకేతాలు వెలువరించింది. ఈ క్రమంలో డిఆర్‌డిఒ రక్షణ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా దఫాలవారిగా చేపట్టిన పరిశోధనలు, ఆయుధ వ్యవస్థల రూపకల్పనల దిశలో తొలుత హైపర్‌సోనిక్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేషన్ వెహికల్ (హెచ్‌ఎస్‌టిడివి)ని పరీక్షించారు. సెప్టెంబర్ 7వ తేదీన దీనిని ప్రయోగించారు. తరువాతి క్రమంలో అత్యంత విస్తారిత సాంకేతిక పరిజ్ఞానపు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ శ్రేణిని పరీక్షించారు. ఇది 400 కిలోమీటర్ల లక్షాన్ని దెబ్బతీయగలదు. తరువాత అణు ఆయుధ సంపన్న శౌర్య మిస్సైల్ దూసుకువెళ్లింది. దీనికుండే అత్యంత అధునాతన టార్పిడో విడుదల ద్వారా సబ్‌మెరైన్లను విధ్వంసం చేసేందుకు వీలుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News