Friday, May 10, 2024

ఇది హారర్ మూవీ కాదు

- Advertisement -
- Advertisement -

70mm is not Horror movie

 

జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రలో ఎస్.ఎస్.ఈ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’70 ఎమ్‌ఎమ్’. అక్షత శ్రీనివాస్, మనోజ్ నందన్, అక్షిత, బెనర్జీ, సంపూర్ణేష్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ “రియలిస్టిక్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇది హారర్ మూవీ కాదు. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో తన తండ్రి ఇచ్చిన పాత సింగిల్ స్క్రీన్ థియేటర్ అమ్మడం ఇష్టం లేక పాత సినిమాలు, శృంగార చిత్రాలు నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. అయితే ఆ థియేటర్‌లో అనుకోకుండా ఒక మర్డర్ జరుగుతుంది. హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే ఎక్కడ థియేటర్‌ను మూసేస్తారో అని శవాన్ని థియేటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చి పెడతారు. అయితే ఆతర్వాత ఆ థియేటర్లలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్ చాలా అద్భుతంగా వచ్చింది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News