Sunday, May 5, 2024

‘డబుల్ సెంచరీ’తో కదం తొక్కిన పృథ్వీషా

- Advertisement -
- Advertisement -

Prithvi Shaw Slams Double Century in Vijay Hazare Trophy

 

జైపూర్: ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో భాగంగా గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ పృథ్వీషా 227 (నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసక రీతిలో విరుచుకుపడిన పృథ్వీషా వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన షా 152 బంతుల్లోనే 31 ఫోర్లు, మరో ఐదు భారీ సిక్సర్లతో అజేయంగా 227 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఓపెనర్‌గా దిగిన షా ఆరంభం నుంచే పుదుచ్చేరి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ వారిని బెంబేలెత్తించాడు. షా ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా డీలాపడి పోయారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా కళ్లు చెదిరే సెంచరీతో చెలరేగి పోయాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ 58 బంతుల్లోనే 22 ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 133 పరుగులు సాధించాడు. ఇటు షా, అటు సూర్యకుమార్ కదం తొక్కడంలో ముందుగా బ్యటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 457 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. లిస్ట్‌ఎ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక తర్వాత అసాధ్యమైన లక్షంతో బాయటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 224 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబై 233 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News