Friday, May 3, 2024

మనదేశంలోనే మిస్ వరల్డ్ పోటీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది జరిగే 71 వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం వేదిక కానుంది. అందాల అంతర్జాతీయ పోటీలో సమున్నతమైన ఈ ఈవెంట్‌కు ఇండియా ఆతిధ్యం ఇవ్వనుంది. భారతదేశంలో ఈ పోటీలు జరుగుతాయని మిస్ వరల్డ్ సంస్థ అధికారిక ప్రకటన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులు ఛైర్మన్ జులియా మోర్లీ పేరిట ప్రకటన వెలువడింది. 28 ఏండ్ల విరామం తరువాత మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం వేదికకానుంది. ఇంతకుముందు 1996లో బెంగళూరులో ఈ పోటీలు జరిగాయి.

ఈసారి మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వరకూ ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో తొలిస్థాయి పోటీలు ఉంటాయి. కాగా మార్చి 9న మిస్‌వరల్డ్ ఫైనల్ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గతంలో మిస్‌వరల్డ్‌లుగా ఐశ్యర్యారాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ ఎంపికయ్యారు. కేవలం అందం , శారీరక సొగసు కాకుండా మానసిక స్థయిర్యం, సమయస్ఫూర్తి, సాధికారికత వంటి పలు అంశాలు ఈ పోటీలలో గీటురాయిలు అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News