Sunday, May 5, 2024

తెలుగు రాష్ట్రాల్లో 72,767మంది బాలికలు, మహిళలు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. బుధవారం పలువురు రాజ్యసభ సభ్యులు సభలో అడిగిన ప్రశ్నకలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏటా వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమైతున్నారని గత మూడేళ్లలో 72, 767 మంది జాడలేదని పార్లమెంటుకు నివేదిక అందించారు. వీరిలో 15. 994 మంది బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.

ఏపీలో 2019 నుంచి 2021 వరకు 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు మిస్సయ్యారని పేర్కొంది. తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు కనిపించకుండా పోయారని తెలిపింది. జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం రెండు రాష్ట్రాల్లో మహిళలు అదృశ్యమైతున్న కేసులు ప్రతి ఏటా పెరుగుతాయని కేంద్రం తన నివేదికలో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News