బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపణపై ఇండియా టుడే గ్రౌండ్ రియాలిటీ చెక్ నిర్వహించింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఐటీ కారిడార్ లో భాగమైన మహదేవపుర లోని బూత్ నెంబర్ 470 లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మునిరెడ్డి గార్డెన్ లోని ఇంటినెంబర్ 35లోనే 80 మంది ఓటర్లు మోసపూరితంగా నమోదు చేసుకున్నారని రాహుల్ ఆరోపణ. కాగా 10-15 చదరపుఅడుగుల విస్థీర్ణంగల ఆ ఇంట్లో దీపాంకర్ అనే పుడ్ డెలివరీ కార్మికుడు ఉంటున్నాడు. నెల్లాళ్ల క్రితమే అతడు ఆ ఇంట్లో చేరాడు. బెంగళూరులో తనకు ఓటు లేదని, ఆ చిరునామాతో ఉన్న ఓటర్ల జాబితాలోని పేర్లు తనకు తెలియవని అతడు తెలిపాడు. ఆ ఇల్లు జయరాం రెడ్డికి చెందినదని దీపాంకర్ చెప్పాడు. ఆయన బీజేపీ కి చెందిన వాడని కూడా చెప్పాడు. కాగా,జయరాం రెడ్డిని సంప్రదించినప్పుడు తాను బీజేపీ ఓటర్ ను మాత్రమేనని కార్యకర్తను కానని తెలిపారు.
చాలామంది అద్దెదారులు ఆ ఇంట్లో ఉండేవారని,వారు ఓటర్లుగా పేరు నమోదు చేసుకుని ఉంటారని, వారు ఖాళీ చేసినా ఎన్నికల
సమయంలో తమ ఓటు వేసేందుకు తిరిగి వస్తారని జయరాం రెడ్డి తెలిపారు.ఈ మార్పుల గురించి తాను ఎన్నికల అధికారులకు చెప్పలేదని,ఇప్పుడు చెబుతానని రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాలో 80 మంది ఉన్నట్లు చిరునామాలో చూపారని, అయితే ఇంత
మందికి ఇల్లు చాలదని స్పష్టం చేశారు. గతంలో అక్కడ ఉన్నవారు ఒడిశా, బీహార్,ఇతర జిల్లాలు మాండ్య, ఇతర జిల్లాలకు మకాం మార్చారని, అయితే ఎన్నికల సమయంలో వారిలో కొందరు ఓటు వేయడానికి ఈ ప్రాంతానికి వస్తారని రెడ్డి అంగీకరించారు. బూత్ లెవల్ ఆఫీసర్ ( బిఎల్ ఓ) మునిరత్న ఈ రిపోర్ట్ ను ధ్రువీకరించారు. ఐటీ కారిడార్ లో చిన్న ఇళ్లలో చాలామంది వలస కార్మికులు ఓటర్ ఐడీ పొందేందుకు రెంటల్ అగ్రమెంట్లను చూపి నమోదుచేసుకుంటారని వారంతా సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపర్లు, పనిమనుషులుగా పనిచేస్తారు. ఓటర్ ఐడీ పొందిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేస్తారు. కానీ, ఓటర్ల జాబితాలో ఆ పేర్లు అలాగే ఉంటన్నారు మునిరత్న.
వేరే చోటికి పోయిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి పంపామని, కానీ, విధాన పరమైన ప్రొటోకాల్ కారణంగా వారి పేర్ల తొలగింపు పెండింగ్ లో ఉందని మునిరత్న తెలిపారు.ప్రశ్నించినప్పుడు ఈ ఓటర్లలో చాలా మంది తమ పేర్లను తొలగించడానికి నిరాకరించారని,తమకు ఓటర్ ఐడీ ముఖ్యమని, ఓటు వేయడానికి తిరిగి వస్తామని చెప్పేవారని తెలిపారు.రాహుల్ వాదనను ఖండించిన ఇంటి యజమానిరాహుల్ గాంధీ తికమక పడ్డారని, 80 మంది సభ్యుల ఇంటి యజమాని రెడ్డి పేర్కొన్నారు.
తాను బీజేపీకి చెందిన వాడిని కాదని, కాంగ్రెస్ కు చెందిన వాడినని జయరాం రెడ్డి తెలిపారు.తన ఇంట్లో అద్దెకు వచ్చిన వారంతా 6 నెలలలోపే ఉండేవారిని, అద్దె ఒప్పందంలో ఓటర్ ఐడీ తయారు చేసుకునే వారని, వారు ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇప్పటికీ ఈ చిరునామాతో ఐడీ కార్డులు ఉపయోగిస్తున్నారని తెలిపాడు. చాలా వరకూ మధ్యవర్తుల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందే వారని తెలిపారు. వలస కార్మికులలో చాలా మందికి ఓటర్ ఐడీ ఉన్నా, ఓటు వేసేందుకు వచ్చేవారు కారని ఆ ఇంటి యజమాని చెప్పాడు.