Tuesday, May 7, 2024

కరోనా కొత్త కేసులు తగ్గుదల

- Advertisement -
- Advertisement -

9923 new covid cases reported in india

న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా 12 వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు 10 వేల దిగువకు చేరాయి. పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 70 వేల పైకి ఎగబాకాయి. సోమవారం 3.88 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 9923 మందికి వైరస్ పాజిటివ్ కనిపించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.55 శాతానికి చేరింది. మహారాష్ట్ర, కేరళలో రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఢిల్లీలో వెయ్యి మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు దేశంలో 4.33 కోట్లకు పైగా కేసులొచ్చాయి. ఇటీవల కాలంలో కరోనా విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 79,313 కి చేరింది. క్రియాశీల రేటు 0.18 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.61శాతంకు పడిపోయింది. సోమవారం 7293 మంది కోలుకోగా, 17 మంది మరణించారు. మొత్తం 4.27 కోట్ల మందికి పైగా వైరస్‌నుంచి కోలుకున్నారు. 5.24 లక్షల లమలందికి పైగా మహమ్మారికి బలయ్యారు. సోమవారం 13 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా, 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News