Monday, May 20, 2024

దృష్టిమరల్చి చోరీలు చేస్తున్న యువకుడు అరెస్ట్…

- Advertisement -
- Advertisement -

Atm-thief

హైదరాబాద్: వృద్ధుల దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న యువకుడిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన మహ్మద్ ఆషాన్ రెహమాన్ అలియాస్ ఫైసల్ ఎంటిఎం వద్ద మాటువేసి డబ్బులు తీసుకునేందుకు వచ్చేవారిని లక్షంగా చేసుకుని చోరీలు చేస్తున్నాడు. నగరంలోని జాఫర్ రోడ్డు వద్ద ఉన్న ఎస్‌బిహెచ్ ఎటిఎంలో నుంచి డబ్బులు తీసుకునేందుకు వచ్చిన వృద్ధుడి నుంచి రూ.60,000 బలవంతంగా లాక్కుని తీసుకుని పరారవుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.60,000 స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు.

Police Arrested a ATM Thief At Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News