Wednesday, May 8, 2024

ఫిబ్రవరి మొదటి వారంలో రెండవ కారిడార్ మెట్రో పరుగులు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు

జెబిఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు నడపనున్న హెచ్‌ఎంఆర్

Hyderabad Metro

 

మన తెలంగాణ, సిటీబ్యూరో: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండవ కారిడార్ జెబిఎస్ నుండి ఎంజిబిఎస్‌ వరకు ఫిబ్రవరి మొదటి వారంలో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు. ఇప్పటికే సాంకేతిక పరమైన అనుమతులు రావడంతో ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గత రెండేళ్ల కాలంలో మొదటికారిడార్ నాగోల్ నుండి మియాపూర్, మూడో కారిడార్ ఎల్బీనగర్ నుండి మాదాపూర్ వరకు మెట్రో రైలును ప్రారంభించి లక్షలాదిమంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతుంది. మెట్రోలో రోజు 4 లక్షల మంది వరకు ప్రయాణించడంతో మూడో కారిడర్ పనులు వేగం పెంచి, జెబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నడపాల్సిన రైలు, భూసేకరణ కారణంగా ఎంజిబిఎస్‌ వరకు నడపాలని అధికారులు సిద్దమయ్యారు. 10కిలోమీటర్లు 11 స్టేషన్లు ఉన్నట్లు వాటిల్లో ప్రయాణికులు ఉండే విధంగా లిఫ్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కారిడార్‌లో రైలు నడిపితే రోజుకు 5లక్షల మంది టార్గెట్ చేరుకుంటాని హెచ్‌ఎంఆర్ అధికారులు భావిస్తున్నారు. టికెట్లు ధరలు 10కిమీ నుంచి 14 కిమీ ప్రయాణిస్తే రూ. 40లు, 14కిమీ నుండి 18కిమీ వరకు రూ. 45లు, 18నుండి 22కిమీ రూ. 50లు నిర్ణయించారు. 22కిమీ నుండి 26కిమీ వరకు వెళ్లితే రూ. 55వరకు చెల్లించి టికెట్లు పొందాలని అధికారులు వెల్లడిస్తున్నారు. ఫిబ్రవరి మొదటివారం తరువాత మూడు కారిడార్లపై మెట్రో రైలు పరుగులు పెట్టి ప్రయాణికులను వివిధ స్థలాలకు చేర్చుతామని అధికారులు పేర్కొంటున్నారు.

 

Metro Run from JBS to MGBS in February 1st week
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News