Saturday, April 27, 2024

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’గా అక్కినేని అఖిల్..

- Advertisement -
- Advertisement -

Akhil

 

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా సరిగా ఆడకపోవడంతో ఆచూతూచి అడుగులేస్తున్నాడు. స్వయంగా కింగ్ నాగార్జునే హాండిల్ చేసినా అఖిల్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. దీంతో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ బరిలోకి దిగాల్సి వచ్చింది. అఖిల్ కు తొలి హిట్ ను అందించేందుకు పక్కా ప్లాన్ తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జిఎ2 పథాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, వాసు వర్మలు కలిసి ఓ కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ కు జోడీగా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ చిత్రయూనిట్ ట్వీట్టర్ వేదికగా విడుదల చేసింది. ఈ నెల 8వ తేదీన ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Akhils Most Eligible Bachelor First Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News