పేరు : సారా అలీఖాన్
పుట్టిన రోజు : ఆగస్టు 12, 1995
పుట్టిన స్థలం : గినెవా, స్విట్జర్లాండ్
తల్లిదండ్రులు : సైఫ్ అలీఖాన్,
అమృతాసింగ్
స్వస్థలం : ముంబయి
అలవాట్లు : ట్రావెలింగ్, టెన్నిస్
మొదటి సినిమా : కేదార్నాథ్ (2018)
ఇష్టమైన నటి : కత్రినాకైఫ్
ఇష్టమైన ఫుడ్ : హైదరాబాద్ బిరియాని
సినిమాల్లోకి రాకముందు ఆహార వ్యాయామాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు సారా. ఎప్పుడైతే సినిమాల్లో అడుగుపెట్టిందో ఆమె తన తీరు మార్చుకుంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన ఆమె సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫిట్నెస్ రహస్యాల గురించి ఇలా చెబుతోంది సారా.
* రోజూ ఒకే రకమైన వ్యాయామాలు చేయడం వల్ల ఫలితం ఉండదు. అందుకే నేను వ్యాయామాలను కలిపి లేదా మార్చి అనుసరిస్తూ ఉంటాను. పిలేట్స్ నుంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వరకూ బూట్‌క్యాంప్ వర్కవుట్స్, కార్డియో ఇలా వేర్వేరు వ్యాయామాలకు ఫిట్‌నెస్‌లో స్థానం కల్పిస్తుంటాను. మొదట్లో అవసరానికి మించి బరువు ఉండేదాన్ని కాబట్టి చురుగ్గా వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరించేది కాదు. అందుకే ఎక్కువగా వాకింగ్, సైక్లింగ్ చేసి బరువు తగ్గించుకున్నాను. ఆ తర్వాత పిలేట్స్ వ్యాయామం కోసం ’నమ్రతా పురోహిత్’ అనే ట్రైనర్‌ను నియమించుకున్నాను. ఈ వ్యాయామం కండరాల ఫ్లెక్సిబిలిటీని పెంచింది.
* నేనెంతో ఇష్టపడి నేర్చుకున్న ఒడిస్సీ నృత్యం నా అధిక బరువు తగ్గించుకోవడానికి తోడ్పడింది.
* సిండీ జోర్డాన్ దగ్గర బూట్ క్యాంప్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇది కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడింది. దీనిలో ఫుల్ బాడీ వర్కవుట్లు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉంటాయి. ఏరోబిక్స్ చేసిన ఫలితం కూడా దక్కుతుంది.
Sara Ali Khan Weight Loss Journey From 96 To 46