Saturday, May 4, 2024

గ్యాస్ ధరల మంటలు

- Advertisement -
- Advertisement -

 Gas

వంటగ్యాస్ ధర ఒకేసారి రూ. 144.5 పెంపు

అదే సమయంలో రూ. 153.86
నుంచి రూ.291.48కి పెరిగిన
సబ్సిడీ n సబ్సిడీ లేని సిలిండర్
ధర భారీగా పెరుగుదల

న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ఒకేసారి రూ. 144.5 పెరిగింది. అయితే సబ్సిడీని కూడా అదే స్థాయిలో పెం చారు. ఇప్పటి వరకు రూ.714గా ఉన్న సిలిండర్ ధర తాజాగా 858 రూపాయాలకు చేరిం ది. దీంతో ఇప్పటి వరకు ఇస్తున్న రూ.153. 86 ఇస్తున్న రాయితీని 291.48 రూపాయాలకు పెంచారు. ప్రధానమంత్రి ఉజ్వల యో జన లబ్ధిదారులకు మాత్రం రూ.312 రాయితీ ఇవ్వనున్నారు. ఆరేళ్ల తర్వాత వంటగ్యాస్ ధ రలు ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి.

మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్‌పిజి ధర లు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్‌పిజి సి లిండర్‌కు వరుసగా రూ 144.5, రూ 145 వర కూ పెంచినట్టు ఇండేన్ బ్రాండ్ నేమ్‌తో వంటగ్యాస్‌ను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్ పేర్కొంది. తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్‌కతాలో రూ 896కు పెరిగాయి. కాగా ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తుండగా, అదనపు సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చే యాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పిజి ధరలు, రూ పాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది.

The price of Gas has risen Enormously
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News