Tuesday, April 30, 2024

బ్రిడ్జిపై నుంచి కారు పడి ఒకరు మృతి…

- Advertisement -
- Advertisement -

Car-Accident

హైదరాబాద్: నగరంలోని భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. ఈఘటనలో సొహెల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వెళ్తుండగా జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బయో డైవర్సిటీ కారు ప్రమాదం మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘోరం జరగడం గమనార్హం.

Car fall down on Bharat Nagar Bridge At Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News