Sunday, April 28, 2024

ప్రముఖ బెంగాలీ నటుడు ‘తపస్ పాల్’ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

tapas-pal-died

కోల్ కత్తా: బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి తపస్ పాల్(61) మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తన కూతురిని చూడడానికి ముంబై వెళ్లి, తిరిగి సోమవారం రాత్రి బయలుదేరారు. ఎయిర్ పోర్టులో తన ఛాతీలో నొప్పిగా ఉందని సహాయక సిబ్బందికి చెప్పారు. దీంతో ఆయనను వెంటనే జుహులోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తపస్ పాల్ తుదిశ్వాస విడిచారు. గతంలో కూడా తపస్ గుండెజబ్బుతో బాధపడ్డారు. ఆయనకు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు.

1980లో ‘దాదర్ కీర్తి’ సిన్మాలో బెంగాలీ చిత్ర సీమలో ఆయన అడుగుపెట్టారు. 1984లో మాధురీ దీక్షిత్ తో కలిసి ‘అబోద్’ సినిమాలో నటించారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాల్లోనూ రాణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.

Bengali actor And former TMC MP Tapas Pal passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News