Tuesday, April 30, 2024

బాయ్ ఫ్రెండ్ బెదిరింపులు…. పెళ్లైనా 11 రోజులకే నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: మాజీ బాయ్ ఫ్రెండ్ నవ వధువు భర్తకు ఇద్దరు కలిసిన దిగిన ఫొటోలు పంపుతానని బెదిరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నసంఘటన తమిళనాడులోని చెన్నూరు కుప్పమ్ పునేమళ్లే ప్రాంతంలో జరిగింది. పెళ్లైన 11 రోజులకే నవ వధువు ఉరేసుకొని చనిపోవడంతో మాజీ లవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సరస్వతి అనే అమ్మాయి ముత్తు అనే యువకుడిని ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకుంది. భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటుండగా మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమెకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి దిగిన ఫొటోలు నీ భర్తకు పంపుతానని బెదిరించాడు. దీంతో తన కాపురం కూలిపోవడంతో పాటు తన పరువు పోతుందని బయపడిన సరస్వతి అత్తగారింట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కీఝపక్కమ్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి ముందు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. లైంగిక వేధింపులు తాళలేక ఎవరైన ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తే తమ నంబర్ కు (044 24640050) ఫోన్ చేయాలని స్నేహ సూసైడ్  ప్రివెన్సన్ అసిస్టెన్స్ వాళ్లు తెలిపారు. జీవితంలో ఒడిదొడుకులు ఉన్నవారు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే తమకు తెలియజేయాలన్నారు.

 

Bride Commit Suicide with Boy Friend Threat in TN

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News