Friday, April 26, 2024

ఆలయ భూమిలో పురాతన బంగారు నాణేలు లభ్యం

- Advertisement -
- Advertisement -

Temple

తిరుచిరాపల్లి(తమిళనాడు): తిరుచిరాపల్లి సమీపంలో ఒక ప్రాచీన ఆలయంలో తవ్వకాలు జరుపుతున్న కార్మికులకు భారీ నిధి లభించింది. పూల తోట వేసేందుకు ఖాళీ స్థలాన్ని చదును చేస్తున్న కార్మికులకు భూమిలో పురాతన బంగారు నాణేలు ఉన్న కుండ లభించింది. ఇందులో 1.7 కిలోలకు పైగా బరువున్న బంగారు నాణేలు లభించాయి. తిరువనైకావల్‌లోని శ్రీ జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఈ బంగారు నిధి లభించింది. మొత్తం 505 బంగారు నాణేలు ఉన్నాయని, వీటిని కార్మికులు ఆలయ అధికారులకు అప్పగించారని అధికార వర్గాలు తెలిపాయి.

శ్రీరంగం తహసిల్దార్ ఆర్ శ్రీధర్ ఈ బంగారు నాణేలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమచేశారని, వీటిని పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తారని వర్గాలు చెప్పారు. వెంటనే నిధి దొరికిన స్థలాన్ని రక్షిత ప్రాంతంగా అధికారులు ప్రకటించి అక్కడకు ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడ తవ్వకాలను కూడా నిలిపివేయించారు. ఈ ప్రాంతంలో చేపట్టవలసిన తదుపరి చర్యలపై ఎఎస్‌ఐ అధికారులు నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్పారు. కాగా, కావేరి, కొల్లిదాం నదుల మధ్యలో తిరువనైకావల్ దీవి ఉంటుంది. ఈ దీవిలోనే 1600 సంవత్సరాల పూర్వం నాటి జంబుకేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చోల రాజులు నిర్మించారు.

Gold coins found in temple land, ancient gold coins found in a pot at Jambukeswara temple in Thiruvanaikaval in TN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News