Tuesday, May 14, 2024

సచివాలయానికి కరోనా సెగ

- Advertisement -
- Advertisement -

Secretariat

 

మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్‌కు వైరస్
రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య
77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన వారి నుంచి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో రాష్ట్రంలో ఒక్క సారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తుల ద్వారా మంగళవారం ఒక్క రోజే మరో 15 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఢిల్లీలోని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన వారు, రాష్ట్రానికి వచ్చి వారి బంధువుల్లోని 15 మందికి వైరస్ సోకించారని ఈటల రాజేందర్ ప్రకటనలో తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 97కి చేరింది. దీనిలో ఇప్పటికే 14 మంది డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. మరో 77 మంది యాక్టివ్ కేసులు వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నట్లు మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో మర్కజ్ నుంచి వచ్చిన వారందరు సిఎం సూచన మేరకు గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ఆయన వెల్లడించారు.

కరోనా లక్షణాలు ఉన్నవారు, వారి బంధువులను కూడా పరీక్షలకు తీసుకురావాలని మంత్రి కోరారు. డయాలసిస్, తలసీమియా, సికెల్ సెల్ జబ్బులున్న వారికి రక్తమార్పిడికి అవసరమవుతుందని, కావున వీరిని సిఎం సూచనల మేరకు ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు వాహానాలను పోలీసులు అడ్డుకోవద్దని మంత్రి తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు లేకుండా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు పనిచేస్తాయని, కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఇంట్లోనే ఉండి సహకరించాలని ఈటల కోరారు. ఇదిలా ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతుందని తెలిసి రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సచివాలయ ఉద్యోగికి కరోనా…
రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగికి కరోనా సొకినట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవలే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లోచ్చారు. దీంతో ఆ ఉద్యోగిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బిఆర్కేభవన్(సచివాలయం) మొత్తం శానిటేషన్ చేశారు.

 

Corona fear to the Secretariat
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News