Monday, April 29, 2024

55 ఏళ్ల ‘తేనె మనసులు’

- Advertisement -
- Advertisement -

krishna maheshbabu

 

తెనాలి పక్కన బుర్రిపాలెం అనే చిన్న పల్లెటూరులో పుట్టిన శివరామకృష్ణ అనే వ్యక్తిని సూపర్ స్టార్ కృష్ణగా మార్చింది ‘తేనే మనసులు’ అనే సినిమా. తెలుగులో ఇదే తొలి సాంఘీక రంగుల చిత్రం కావడం గమనార్హం. కాగా సూపర్ స్టార్ కృష్ణ వెండితెరకు పరిచయమైన చిత్రం ‘తేనెమనసులు’ విడుదలై మంగళవారానికి సరిగ్గా 55 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మహేష్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “టైమ్‌లెస్ క్లాసిక్ అయిన ‘తేనే మనసులు’ నా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ గారి ప్రయాణం మొదలై ఈ మంగళవారంతో 55 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ప్రారంభం బ్లాక్ బస్టర్‌తోనే మొదలైంది.

మన సూపర్‌స్టార్ లెజెండరీ జర్నీ తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకుందాం” అని మహేష్ పోస్ట్ చేశారు. కాగా ఈ సినిమా గురించి కృష్ణ గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నాకు కొద్దిగా నాటకానుభవం ఉన్నప్పటికీ ఈ సినిమా చేసేటప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడూ, పాటలకు లిప్ మూమెంట్ ఇచ్చేటప్పుడూ చాలా కష్టపడ్డాను. దర్శకుడు ఆదుర్తి, నృత్య దర్శకుడు హీరాలాల్, కో-డైరెక్టర్ కె.విశ్వనాథ్ కూడా నాకు నటనలో కొన్ని మెలకువలు నేర్పారు. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత నా నటన చూసుకుని ఎంతో సంతోషించాను” అని కృష్ణ తెలిపారు.

 

Tene manasulu movie completed 55 years
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News